సమంత వన్ బకెట్ చాలెంజ్! ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్  

Samantha Akkineni Starts One Bucket Challenge-

వేసవి వచ్చింది అంటే హైదరాబాద్, చెన్నై లాంటి మహా నగరాలలో త్రాగు నీటి కష్టాలు తీవ్రంగా ఉంటాయి.సామాన్య, మధ్య తరగతి ప్రజలకి కనీసం రోజు వారి అవసరాలకి కూడా నీరు దొరకడం గగనం అయిపోతుంది.

Samantha Akkineni Starts One Bucket Challenge--Samantha Akkineni Starts One Bucket Challenge-

ట్యాంక్ లతో నీటిని పంపిణీ చేసిన సరిపోవడం లేదు.ఇక వర్షాకాలంలో అయితే నీరు వరదలై పారిన కూడా చుక్క నీరు త్రాగడానికి పనికి రాదు.ఈ కారణంగా నిత్యం మంచినీటి కష్టాలు నగరవాసిని వేధిస్తూనే ఉన్నాయి.ఈ నేపధ్యంలో ఇప్పటికే పర్యావరణ వేత్తలు నీటిని పొడుపు చేయాలని చెబుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రజలలో నీటి పొదుపు గురించి అవగాహన కల్పించడానికి స్టార్ హీరోయిన్ సమంత వినూత్న పంథా ఎంచుకుంది.

Samantha Akkineni Starts One Bucket Challenge--Samantha Akkineni Starts One Bucket Challenge-

ముఖ్యంగా ఉన్నత వర్గాలలో నీటి దుబారా ఎక్కువగా ఉంటుంది.కులాయిలు తిప్పేసి ఇష్టారాజ్యంగా నీటిని వదిలేసి వృదా చేస్తూ ఉంటారు.ఇప్పుడు అలాంటి వారిని టార్గెట్ గా చేసుకొని నీటిని వృదా చేయకూడదని, నీళ్ల కోసం నల్లాను తెరిచి అలా వదిలేయకూడదని, ప్రతి నీటి బొట్టూ విలువైనదని నటి సమంత సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది.నీటి వనరులని ఆదా చేయాలని వాటర్‌ పాలసీని కఠినంగా అమలు చేయాలని సోషల్‌ మీడియాలో వన్‌ బకెట్‌ ఛాలెంజ్‌ ప్రారంభమైంది.

ఈ క్రమంలో తాజాగా వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను నటి సమంత స్వీకరించారు.నీటిని వృథా చేయొద్దని ట్విటర్‌ వేదికగా ఆమె ప్రజలను కోరారు.నాతోపాటు ఈ చాలెంజ్ ని స్వీకరించేది ఎవరు అంటూ నెటిజన్లను ఉద్దేశిస్తూ అమె ట్విట్‌ చేశారు.చాలెంజ్ స్వీకరించే వారు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని చెప్పింది.తాజా సమంత చాలెంజ్ ని ఇప్పుడు టాలీవుడ్ హీరోలు కూడా ఒకే చెప్పడం విశేషం.