నగర ప్రజలకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్న సజ్జనార్.. !

తెలంగాణ ప్రభుత్వం మరోమారు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.

ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్ రెండో సారి అమలు చేసే సమయంలో పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

అనవసరంగా రోడ్ల మీద తిరిగే వారిని, కరోనా నిబంధనలు పాటించని వారి పట్ల కేసులు నమోదు చేయడం, వాహనాలను సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకున్నారు పోలీస్ అధికారులు.ఈ చర్యల వల్ల కరోనా కేసులు కొంత మేర తగ్గాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట.

Sp Sajjanar Serious Warning To City Police, City Peoples, Serious Warning, Sajja

ఇక మూడో సారి విధించిన లాక్‌డౌన్‌లో సమయాన్ని రెండు గంటలు పెంచారు.ఇలా మొత్తంగా ఆరుగంటల పాటు ప్రజలు తమ పనులు చేసుకునే వెలుసుబాటు కలిగించారు.

ఈ నేపథ్యంలో నగర ప్రజలకు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు.ఈరోజు కూకట్ పల్లి, జేఎన్టీయూ చెక్ పోస్ట్, వై జంక్షన్, సనత్ నగర్, బాలానగర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించిన సజ్జనార్ ప్రజలను ఉద్దేశిస్తూ లాక్ డౌన్ అమలవుతున్న వేళల్లో అనవసరంగా రోడ్లపైకి రాకూడదని అలా వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

ఇకపోతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకులను కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెరచి ఉంచాలని, ఇక భూముల రిజిస్ట్రేషన్లకు వెళ్లేవారు స్లాట్ బుక్ చేసుకోని, వాటిని చూపించి వెళ్లాలని పేర్కొన్నారు.

ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?
Advertisement

తాజా వార్తలు