మెగా హీరో 'విరూపాక్ష' కమర్షియల్‌ గా గట్టెక్కేనా?

మెగా హీరో సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) నటించిన విరూపాక్ష చిత్రం( Virupaksha movie ) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సంయుక్త మీనన్( Sanyukta Menon ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ దండు( Karthik Dandu ) దర్శకత్వం వహించాడు.

సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన కార్తీక్ విరూపాక్ష చిత్రం తో తాను విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు హీరో సాయి ధరంతేజ్ కి.హీరోయిన్ సంయుక్త మీనన్‌కి ఇతర యూనిట్ సభ్యులందరికీ కూడా సక్సెస్ ని అందించాడు.

Sai Dharam Tej Virupaksha Movie Box Office Collections Report , Saidharam Tej ,

పాజిటివ్ రివ్యూలు రావడం తో చిత్ర యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.ఇక సినిమా కు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.మొదటి రోజు కలెక్షన్స్ హిట్ టాక్ దక్కడంతో పర్వాలేదు అన్నట్లుగా వచ్చాయి.

వీకెండ్స్ అయినా శని ఆది వారాల్లో కాస్త ఎక్కువగా కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది.

Advertisement
Sai Dharam Tej Virupaksha Movie Box Office Collections Report , Saidharam Tej ,

సాయి ధరమ్ తేజ్ కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకుని చాలా కాలమైంది.తన సినిమా తో బ్రేక్ ఈవెన్ సాధించి చాలా కాలం అవ్వడం తో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా తో అయినా కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకుంటాడా అంటూ మెగా అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

ఈ మధ్య కాలం లో సంయుక్త మీనన్‌ నటించిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

Sai Dharam Tej Virupaksha Movie Box Office Collections Report , Saidharam Tej ,

కనుక ఈ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ ( Commercial success )ని సొంతం చేసుకునే అవకాశాలు లేకపోలేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎంత వరకు ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే శని ఆదివారం పూర్తయిన తర్వాత సోమ వారం వచ్చే కలెక్షన్స్ ని బట్టి విరూపాక్ష చిత్రం యొక్క తుది ఫలితం ఆధారపడి ఉంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు