అల్లరి నరేష్( Allari Naresh ) అనగానే తెలుగు ప్రేక్షకులకు కామెడీ సినిమాలు గుర్తుకొస్తాయి.ఆయన చేసిన ఎన్నో కామెడీ సినిమాలు మరియు పాత్రలు ఎప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోతాయి అనడంలో సందేహం లేదు.
అల్లరి నరేష్ తన కామెడీ తో ఎంతగానో మెప్పించాడు.ఈ మధ్య కాలంలో తన సెంటిమెంట్, యాక్షన్ తో మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
కామెడీ హీరోగా సెటిల్ అయిన అల్లరి నరేష్ సీరియస్ పాత్రలు చేస్తే ఎవరు చూస్తారు అంటూ ఆ మధ్య కొందరు కామెంట్ చేశారు.కానీ వారితోనే ప్రశంసలు పొందే విధంగా అల్లరి నరేష్ నాంది సినిమా( Nandi movie ) తో సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత మారేడుమిల్లి ప్రజానికం ( Maredumilli prajaneekam )సినిమా తో కూడా అల్లరి నరేష్ ఆకట్టుకున్నాడు.ఇక వచ్చే నెలలో మరోసారి సీరియస్ పాత్ర తో ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
నాంది చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల( Vijay Kanakamedala ) దర్శకత్వంలోనే రూపొందిన ఉగ్రం సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ట్రైలర్ విడుదల అయింది.ట్రైలర్ లో అల్లరి నరేష్ ని చూస్తూ ఉంటే బాబాయ్ మా అల్లరి వాడిని మరి ఇంత మొరటోడిగా చేశారు ఏంటి అంటూ దర్శకుడు విజయ్ కనకమేడలని జనాలు ప్రశ్నిస్తున్నారు.నాందిలో ఒక మోస్తరు సీరియస్ పాత్రలో కనిపించిన అల్లరి నరేష్ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అంతకు మించి అన్నట్లుగా ఉగ్రం సినిమా లో తన ఉగ్ర స్వరూపాన్ని చూపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.
ఈ స్థాయిలో అల్లరి నరేష్ ఉగ్ర స్వరూపాన్ని చూపిస్తే కష్టమే కదా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అల్లరోడిని మరి ఇంత క్రూరంగా చూడడం తమ వల్ల కాదు అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు నటుడు అన్నప్పుడు అన్ని రకాల పాత్రలు చేయాలి అన్ని రకాల సినిమాలు చేయాలి.
కేవలం కామెడీ మాత్రమే చేస్తా అంటే కెరియర్ లో ముందుకు సాగడం కష్టం అవుతుంది.అందుకే అల్లరి నరేష్ చేస్తున్న ఈ తరహా పాత్రలను కొంతమంది అభిమానులు అభిమానిస్తున్నారు.
ఉగ్రం సినిమా సక్సెస్ అయితే అల్లరి నరేష్ నుండి మరిన్ని సీరియస్ పాత్రలు సినిమాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.