రైతులకు అక్కరకురాని రైతు వేదికలు...!

సూర్యాపేట జిల్లా: రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఉపాధిహామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రూ.573 కోట్లతో 2604 రైతు వేదికలను నిర్మించిన విషయం తెలిసిందే.

ఈ రైతు వేదికల ద్వారా రైతులంతా ఒకేచోట చేరి వ్యవసాయం ముచ్చట్లు, సాగుచేసే పంటల గురించి చర్చించుకోవడం, సభలు, సమావేశాలు, నిర్వహించడంతో పాటు గోడౌన్‌ గా ఉపయోగ పడతాయని భావించారు.

ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈఓ)లను నియమించారు.ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు రూ.22 లక్షలు ఖర్చు చేసి నిర్మించారు.ఇంత ఖర్చు పెట్టీ గత ప్రభుత్వo నిర్మించిన వేదికలు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో పిచ్చి చెట్లతో నిండిపోయి పడావుబడి,మూతపడి పోయినవి.

ఈ వేదికలలో ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడమే కాక పశువులకు జంతువులకి నివాస స్థావరలుగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.అయినా అధికారులు ఇదంతా చోద్యం చూస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని రైతుల అవసరాల కోసం, లాభసాటి పనులకు వినియోగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!
Advertisement

Latest Suryapet News