భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.200 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోందట.బాహుబలి-2 కంటే కూడా ఇది ఎక్కువ మొత్తం అని చెప్పాలి.ఇంతటి స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే ప్రథమం అని అంటున్నారు సినీ జనం.ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ అదరగొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.తెలుగు సినీ చరిత్రలో ఈ సినిమా చేసిన ప్రీరిలీజ్ బిజినెస్ మరే ఇతర సినిమా చేయకపోవచ్చని అంటున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
జాతి రత్నాలు సినిమా చేయను అని చెప్పాను : ఫరియా 

తాజా వార్తలు