సాగర్లో రోలర్ టెన్షన్...!

నల్లగొండ జిల్లా:అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు వస్తున్న కొద్దీ నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ది నోముల భగత్ ( Nomula Bhagath )కు కొత్తటెన్సన్స్ వచ్చిపడిండి.

స్వతంత్రులకు ఈసి కేటాయించిన రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు తమ కారు గుర్తును పోలి ఉండడంతో గులాబీ అభ్యర్ధికి గుబులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రత్యర్థుల నుండే కాకుండా సొంత పార్టీ అసమ్మతి నేతల నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నోములకు స్వతంత్రుల గుర్తుల రూపంలో టెన్సన్ పట్టుకుందని గులాబీ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మాజీ సిఎల్పీ నేత జానారెడ్డి( CLP leader Jana Reddy ) తనయుడు జైవీర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు.

Roller Tension In Sagar...!-సాగర్లో రోలర్ టెన్�

బీజేపీ కూడా ఈసారి పూర్తి స్థాయిలో ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నా,సాగర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే పోటీ ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పేరు మొదటి ఈవీఎంలోనే మూడో నెంబరు క్రమ సంఖ్యలో ఉంది.

అదే ఈవీఎంలో రోడ్డు రోలర్,చపాతీ రోలర్ గుర్తులు ఉండడమే టెన్షన్ కు కారణంగా భావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణ,ఉపసంహరణ తరువాత 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Advertisement

ఒకే ఈవీఎంలో రోలర్ గుర్తులు,బీఆర్ఎస్ కారు గుర్తు ఉండడంతో పార్టీలో చర్చ నడుస్తోంది.దీంతో పార్టీ నుంచి వచ్చిన సూచనల మేరకు బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో భాగంగా మూడో నెంబరు గుర్తు అని ప్రచారం చేస్తూ గుర్తుపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

నవంబర్ 30 న ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రచారం కూడా తుది దశకు చేరడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.టీఆర్ఎస్ ను గత ఎన్నికల్లో కొన్ని గుర్తులు దెబ్బతీశాయి.పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులు ఇందుకు కారణంమని చెప్పింది.2014లో సాగర్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తు అభ్యర్ధి జనాలకు పెద్దగా తెలియక పోయినా దాదాపు 10 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయని, అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి 16 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారని,రోడ్లు రోలర్ కు పడిన ఓట్లు టీఆర్ఎస్ కారు గుర్తువేనని వాటి వల్లనే మేము ఓడిపోయామని చెప్పుకొచ్చింది.అలాగే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కారు గుర్తు పోలిన గుర్తులు ఉండడంతో నకిరేకల్, పాలేరు,హుజూర్‌నగర్, కామారెడ్డి,సంగారెడ్డి,జుక్కల్ తదితర చోట్ల స్వల్ప మెజార్టీతో ఓడామని, అయితే ఇక్కడ ట్రక్కు, రోలర్ల గుర్తులకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే వాదన బలంగా వినిపించింది.

Advertisement

Latest Suryapet News