చపాతి - రైస్ .. ఏది తింటే మంచిది?

మన ఇంట్లో కూడా వస్తూ ఉండే చర్చే ఇది.వండిన బియ్యాన్ని తినాలా లేక చపాతి/రొట్టె తినాలా అని? రెండిట్లో ఏది బెటర్ అనే టాపిక్ మీద గంటలకొద్దీ చర్చలు పెట్టుకునేవారిని కూడా చూసే ఉంటాం.

మరి న్యూట్రిషన్ నిపుణులు ప్రకారం చపాతి - రైస్ లో ఏది బెటర్? ఏం తినాలి? నిజానికి ఇప్పుడు మనం తింటున్న రైస్ పూర్తిగా న్యూట్రింట్స్ ని కలిగి ఉండదు.కారణం తెలుసుగా, పాలిష్డ్ రైస్ మనం తినేది.

తెల్లగా ఉండేట్లు పాలిష్ చేయడం వలన ఫైబర్, ఐరన్, కాల్షియం, బీ కాంప్లెక్స్ విటమిన్స్ ని కోల్పోతుంది రైస్.అంటే, మనకు అందేది స్వచ్ఛమైన బియ్యం కాదు అన్నామాట.

Rice Or Chapathi? What To Prefer In Your Diet?-Rice Or Chapathi What To Prefer I

చాలామందికి తెలియని విషయం, ఇప్పుడు మనం తినే బియ్యంలో కార్బోహైడ్రేట్‌లు కూడా తక్కువే.అందుకే, మనం ఎక్కువ కాలరీలు తీసుకుంటాం.

అందుకే మిగితావాటితో పోల్చుకుంటే వండిన బియ్యం ఎక్కువ తింటాం అన్నమాట.ఇక కల్తీలేని గోధుమ అలా కాదు.

Advertisement

ఫైబర్, ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, ఐరన్, కాల్షియం, సెలెనియం, పొటాషియం, మెగ్నీషియం .అన్ని బాగా దొరుకుతాయి.కార్బోహైడ్రేట్‌లు బాగా ఉండటంతో ఎక్కువ కాలరీలకు పోకుండా, ఓ లిమిట్ లో తినవచ్చు.

అయితే, రైస్ తో పోల్చుకుంటే చపాతీలో తక్కువ కాలరీలు లభిస్తాయి అని కాదు, కాలరీల ఇంటేక్ మాత్రం తగ్గుతుంది.ఇది లాభదాయకం.కాబట్టి, స్వచ్ఛమైన బ్రౌన్ రైస్ లభిస్తే, మొహమాటం లేకుండా తినండి.

ఇక వైట్ రైస్, చపాతీలలో ఏది తినాలో మీకే వదిలేస్తున్నాం కాని, చపాతీ మాత్రం వైట్ రైస్ కన్నా బెటర్ అప్షన్ లెక్కలోకే వస్తుంది.

ఆ హోటల్‌లో వడలు చూస్తే అమితాబ్ బచ్చన్ ఆగలేరంట.. ఎక్కడంటే..?
Advertisement

తాజా వార్తలు