అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని సెస్ అధికారులకు వినతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో గల బస్ స్టాండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి హై ఓల్టేజ్ కారణంగా ఇండ్లల్లో గల టివి లు, ఫ్రిజ్ లు,కులార్ లు సంపు మోటార్లు కాలిపోయాయి.

దీంతో ఇంటి యజమానులకు వేల రూపాయలలో నష్టం వాటిల్లింది.

బస్ స్టాండ్ ప్రాంతంలో గల ప్రజలకు 160కేవీ ఎస్ ఎస్ 21 ద్వారా ఇక్కడి ఇండ్లకు విద్యుత్ సరఫరా అవుతుంది.వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ సెస్ అధికారికి వినతిపత్రం అందజేశారు.

క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని సెస్ అధికారులు అన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News