కిడ్నీలో రాళ్లను క‌రిగించే ఎర్ర అర‌టి.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

కిడ్నీలో రాళ్లు.నేటి కాలంలో చాలా మందిని ఈ స‌మ‌స్య వేధిస్తోంది.

ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, మ‌ద్యం అల‌వాటు, నీరు త‌క్కువ‌గా తీసుకోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డ‌తాయి.ఈ రాళ్లు చిన్న‌గా ఉంటే.వాటంత‌ట అవే యూరిన్ ద్వారా బ‌య‌ట‌కు పోతాయి.

కానీ, పెద్ద‌గా ఉంటే మాత్రం.ఆ రాళ్లు యురేటర్‌లో చిక్కుకుని తీవ్ర నొప్పిని క‌లిగిస్తాయి.

అదే స‌మ‌యంలో యూరిన్ యొక్క ఫ్లోను అడ్డుకుంటాయి.అందుకే కిడ్నీలో రాళ్ల‌ను ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

Advertisement

అయితే కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాంటి వాటిలో ఎర్ర అర‌టి ముందుంటుంది.

సాధార‌‌ణ అర‌టి పండ్ల‌తో పోలిస్తే.ఎక్కువ పోష‌కాలు ఎర్ర అర‌టి పండ్ల‌లో నిండి ఉంటాయి.

ముఖ్యంగా ఎర్ర అర‌టి పండ్ల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది.ఇది మూత్రపిండాల్లో రాళ్ల‌ను క‌రిగించ‌డంతో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అందువ‌ల్ల‌.కిడ్నీలో రాళ్లు ఉన్న వారు.

డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవితో డ్యాన్స్ ఇరగదీసిన అల్లు అరవింద్...వీడియోలు వైరల్!
ఏంటి భయ్యా.. లక్షల కోట్లకు అధిపతిని రెస్టారెంట్ కి వెళ్తే గుర్తు పట్టలేకపోయారు!

రెగ్యుల‌ర్ ఒక అర‌టి పండు తీసుకుంటే మంచి ఫ‌లితంగా ఉంటుంది.

Advertisement

ఇక ఎర్ర అర‌టి పండు తిన‌డం వ‌ల్ల మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.చాలా మంది బ‌రువు పెరిగిపోతామ‌ని భావించి.ఇష్ట‌మున్నా స‌రే అర‌టి పండ్ల‌కు దూరంగా ఉంటారు.

అయితే ఇలాంటి వారికి ఎర్ర అర‌టి పండ్లు బెస్ట్ అప్ష‌న్‌.ఎందుకంటే, మామూలు అర‌టి పండ్ల కంటే.

ఎర్ర అర‌టి పండ్ల‌లో చాలా త‌క్కువ మోతాదులో కేల‌రీలు ఉంటాయి.అంద‌వ‌ల్ల‌, ఇవి తిన్నా బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు.

అలాగే ఏ ప‌ని చేసినా త్వ‌ర‌గా అల‌సిపోయేవారు మ‌రియు త‌ర‌చూ అల‌స‌ట‌కు గుర‌య్యే వారు ప్ర‌తి రోజు ఒక ఎర్ర అర‌టి పండ్లు తిన‌డం చాలా మంచిది.ఎర్ర అర‌టి పండు ఎనర్జీ బూస్టర్ ప‌ని చేస్తుంది.

ఫ‌లితంగా, నీస‌రం ద‌రి దాపుల్లోకి కూడా రాకుండా ఉంటుంది.ఇక ఎర్ర అర‌టి పండ్లు డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత జ‌బ్బుల‌కు కూడా దూరంగా ఉండొచ్చు.

తాజా వార్తలు