ఏపీలో వాలంటీర్ల నియామకం .. అర్హతలు ఇవేనా ? 

కొత్తగా ఏర్పడబోతున్న ఏపీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తోంది.

ఎన్నికల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశగా ముందడుగు వేసేందుకు అప్పుడే కసరత్తు మొదలు పెడుతున్నారు.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం అయిన వాలంటరీ వ్యవస్థ ( Volunteer System ) విషయంలో భారీగా మార్పు చేర్పులు చేపట్టే దిశగా కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది.తాము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, 5000 గా ఉన్న వారి జీతాన్ని 10000 చేస్తామని ప్రకటించారు.

దీంతో ఈ వాలంటీర్ల నియామకంతో పాటు, జీతం పెంపు పైన నిర్ణయం తీసుకోబోతున్నారు.ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వాలంటరీ వ్యవస్థ పై పూర్తిగా దృష్టి సారించి వారి నియామకాలు చేపట్టనున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ప్రతి గ్రామంలో ఐదుగురిని వాలంటీర్లుగా తీసుకోబోతున్నారు.ప్రస్తుతం ఇస్తున్న 5000 జీతాన్ని 10 వేల రూపాయలకు పెంచే దిశగా కసరత్తు చేస్తున్నారు.

Advertisement
Recruitment Of Volunteers In AP Are These The Qualifications Details, Ap Cm Jaga

దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్( Notification ) ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు.

వాలంటీర్ ల వేతనాన్ని పదివేలకు పెంచనున్నారు.

Recruitment Of Volunteers In Ap Are These The Qualifications Details, Ap Cm Jaga

కొత్త నిబంధనలు ఇవేనా .

వాలంటీర్ల ఎంపికలో డిగ్రీ ( Degree ) ఉత్తీర్ణత అర్హత గా నిర్ణయించబోతున్నారట .అలాగే వయోపరిమితి విషయంలోనూ పరిమితులు పెట్టరున్నారట.గ్రామ పరిధిలోనే కాకుండా, మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు వేస్తున్నట్లు సమాచారం.

వాలంటరీ, సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచ్ ల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాలు రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం.కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

అలాగే కొన్ని పథకాల నిర్వహణ, పంపిణీ విషయంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం.

Advertisement

ప్రతినెల వాలంటీర్ ఇంటికి వెళ్లి అందించే పెన్షన్( Pension ) విషయంలోనూ మార్పులు చేయాలా వద్దా అనే విషయంలో ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.ప్రతినెల పెన్షన్ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలా లేక ప్రస్తుతం అమలవుతున్న విధానాన్నే కొనసాగించాలా అనే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణను రూపొందిస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు