మందుబాటిల్​ లాగించేస్తున్న ఎలుక.. ఇదేం చిత్రం..

సాధారణంగా మందు ఎవరు తాగుతారు? ఇదేం ప్రశ్న అంటున్నారా ? మనుషులు తాగుతారు అందులోను మగవారు ఎక్కువగా తాగుతుంటారు.

కొన్ని చోట్ల మహిళలు కూడా తాగుతుంటారు అనుకోండి అది వేరే విషయం.

అయితే ఓ చోట ఓ ఎలుకల గుంపు మాత్రం బాటిళ్లు బాటిళ్లు లాగించేశాయి.ప్రస్తుతం ఈ టాపిక్​ సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తోంది.

ఎలుకలు మందు తాగిన ఘటన తమిళనాడులో జరిగింది.నీలగిరి జిల్లాలోని కందపూజ ప్రాంతంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది.

ఆ ప్రాంతంలో తమిళనాడు మద్యం దుకాణం నడుపుతోంది.అయితే కరోనా కారణంగా కొన్ని రోజులు దానిని మూసివేశారు.

Advertisement

కొన్ని రోజులు తరువాత ఆ మందు దుకాణాన్ని అధికారులు తెరిచారు.అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

అందులో ఉన్న 12 వైన్​ సీసాలు ఖాళీగా కనిపించాయి.వాటి మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు కనిపించాయి.

దీంతో 12 వైన్​ బాటిళ్లను ఎలుకలే తాగేశాయని నిర్ధారణకు వచ్చారు ఆ తమిళనాడుకు చెందిన ఎక్సైజ్​ అధికారులు.అయితే విచిత్రం ఏంటంటే ఆ ఎలుకలు కేవలం వైన్​ బాటిళ్లను మాత్రం ముట్టుకున్నాయి.

బీరు, ఇతర మందు బాటిళ్ల జోలికి అస్సలు పోలేదు.వాటికి కేవలం వైన్​ నచ్చింది కావచ్చు అని సోషల్​ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.మీరు కూడా తాగడం మొదలు పెడితే ఇక మా మనుషులకు ఎక్కడ మందు దొరుకుంతుంది మూషిక మహారాజా అంటూ జోకులు వేస్తున్నారు నెటిజన్లు.

నీచుడా.. మూత్రం చేసిన చేతులతో పండ్ల వ్యాపారం..(వీడియో)
వీడియో: వావ్, బుల్లెట్ నుంచి అద్భుతంగా తప్పించుకున్న జింక..

ఇన్ని రోజులు ఇళ్లలోనే అనుకున్నా.ఇప్పుడు మందు షాపుల్లోనూ మీరు సెటిల్​ అయ్యారా ఎలుక మామయ్యా అంటూ కూడా కామెంట్లు వస్తున్నాయి.కానీ ఇలా ఎలుకలు మందు తాగడం ఎప్పుడూ చూడలేదని ఎక్సైజ్​ అధికారులు చెబుతున్నారు.

Advertisement

ఏది ఏమైనా ఎలుకలు వైన్​ తాగి పార్టీ చేసుకున్న విషయం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

తాజా వార్తలు