అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట( Ellantakunta ) మండలంలోని పొత్తూరు, వంతడుపుల, రేపాక, గొల్లపల్లి గ్రామాలలో పోషణ్ అభియాన్ లో భాగంగా ఆయా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ప్రతి కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు( Anganwadi teachers ) పిల్లలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని, ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహారం పిల్లలకు అందేలా చూడాలని, పోషకహార లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహనా కల్పించి, సమతుల్య ఆహారం అందించేలా చూడాలని, ఇది అంగన్వాడీ టీచర్ల బాధ్యత అంటూ గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ చంద్రకళ, అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News