సీనియర్ హీరోయిన్ స్థలం కోసం కోర్టు మెట్లెక్కిన రానా.. అసలు ఏం జరిగింది ?

లీడర్ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తనదైన పంథా లో సినిమాలు తీస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు దగ్గుబాటి రానా.

బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో అలరించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బెస్ నీ ఏర్పరుచుకున్నాడు.

ఇటీవల నటించిన విరాటపర్వం సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశపరచిన రానా నట విశ్వరూపం చూపించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆ మధ్యకాలంలో తన ఆరోగ్య సమస్యలతో సైతం కొన్నాళ్లపాటు రానా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం రానా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.అందుకు గల కారణమేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం పదండి.

సీనియర్ హీరోయిన్ మాధవి లత ఆమె సినిమాలో నటించిన సమయంలో హైదరాబాదులో కొన్ని స్థలాలు కొనుగోలు చేసింది.ప్రస్తుతం ఆమె ఫారెన్ లోనే సెటిల్ అయిన నేపథ్యంలో హైదరాబాదులో గల ఫిలింనగర్లో తనకు గల 2200 చదరపు గజాల స్థలాన్ని ఒకటి అమ్మకానికి పెట్టింది.

Advertisement
Rana Daggubati Received Notcies From Court , Rana Daggubati, Senior Heroine Madh

ఈ స్థలాన్ని విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు ఇద్దరూ కలిసి కొనుగోలు చేశారు.సురేష్ బాబు తన వాటాలో గల 1100 గజాల్ని తన పెద్ద కుమారుడు అయిన రానా పేరిట రిజిస్ట్రేషన్ చేపించాడు.అయితే ఈ స్థలంలో అప్పటికే ఒక వ్యాపారి లీజుకు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నాడు.2014 నుంచి మాధవి లతకు సంబంధించిన ఈ స్థలం ఆ వ్యాపారి చేతిలోనే ఉంది.

Rana Daggubati Received Notcies From Court , Rana Daggubati, Senior Heroine Madh

అయితే మాధవి లత ఆ వ్యాపారి తో లీజు వ్యవహారంపై ఒక అగ్రిమెంట్ చేసుకుంది.కాగా ప్రస్తుతం ఆ స్థలాన్ని దగ్గుబాటి కుటుంబం కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆ స్థలం నుంచి సదరు వ్యాపారిని ఖాళీ చేయాలని రానా ఒత్తిడి చేశాడు.కానీ ఆ వ్యాపారికి అప్పటికే అగ్రిమెంట్ ఉన్న కారణంగా ఖాళీ చేయడానికి మొదట ఒప్పుకోకపోయినా, ఆ తర్వాత ఒత్తిడి పెరగడంతో ఖాళీ చేశాడు కానీ ఈ విషయంలో రానా కు వ్యాపారి నోటీసులు పంపగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వ్యవహారంలో రానా కోర్టు నోటీసులు అందుకొని విచారణకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు