మెగా ఫ్యాన్స్ కష్టాలు అర్థం చేసుకున్న రామ్ చరణ్

స్టార్ హీరోల ఆడియో ఫంక్షన్స్ టీవిల్లో చూడడానికి బాగుంటాయి కాని, ఓ అభిమానిలా ఫంక్షన్ కి వెళితే తప్ప తెలియదు అక్కడ ఎన్ని కష్టాలు పడాలో.

ఆడియో ఫంక్షన్ పాస్ కోసం సీనియర్ ఫ్యాన్స్ ని, ఆర్గనైజర్స్ ని బ్రతిమిలాడాలి.

ఇదేమి సినిమా టికెట్ కాదు.పాస్ దొరికిన తరువాత కూడా గంటలకొద్దీ లైన్ లో నిలబడి ఆడియో వేదిక దగ్గరికి వెళ్ళాలి.

Ram Charan Doesn’t Want Mega Fans To Struggle In Financial Crisis-Ram Char

ఆ మార్గమధ్యంలో తోపులాటలు, తొక్కిసలాటలు అబ్బో చాలా ఉంటుంది.ఇది హైదరాబాద్లో, అమరావతిలో ఉండే అభిమానుల కష్టాలు.

నగరాల్లో లేని అభిమానులు వందలు,వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, వేలు ఖర్చుపెట్టుకొని అభిమాన హీరో ఆడియో ఫంక్షన్ చూడడానికి వస్తారు.వీరికి అదనపు కష్టాలు ఉంటాయన్నమాట.

Advertisement

రామ్ చరణ్ ధ్రువ ఆడియో ఇప్పటికె విడుదల అయిపొయింది.అయితే సినిమా రిలీజ్ కి ముందు అభిమానుల కోసం ఓ ఫంక్షన్ పెట్టాలని అనుకున్నారు.

కాని ఆ ఫంక్షన్ ఇప్పుడు జరిగే అవకాశాలు పెద్దగా కనబడట్లేదు.కరెన్సీ బ్యాన్ వలన ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి సమయంలో పది రూపాయలు కూడా వృధాగా ఖర్చు అవకూడదు.అందుకే, ఫ్యాన్స్ కష్టాలు పడకూడదనే రామ్ చరణ్ ఈ ఫంక్షన్ ని ప్రస్తుతానికి వాయిదా వేశాడని టాక్.

పరిస్థితులు మెరుగుపడితే, ఫంక్షన్ ఉండొచ్చు, లేదంటే మొత్తానికే ఉండదు.బాగుంది కదండీ, అభిమానుల కోసం రామ్ చరణ్ ఆలోచన.

ప్రేమించిన వాడిని వదిలేస్తే.. కానీ సినిమాల్లో హిట్ కొట్టని టాలీవుడ్ హీరోయిన్స్
Advertisement

తాజా వార్తలు