రాజమౌళి పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఫ్యామిలీ మొత్తం కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే.

కేవలం పది రోజుల్లోనే వారి కుటుంబం మొత్తం కూడా నెగటివ్‌ కు వచ్చేశారు.

ఇటీవలే రాజమౌళి ఫ్యామిలీ ఫ్లాస్మా దానం చేసిన వారికి సన్మానం చేశారు.ఇప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం కూడా సిటీకి దూరంగా ఉన్న ఫామ్‌ హౌస్‌లో పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు.

మొన్నటి వరకు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కు సంబంధించిన చర్చలు చేయడం మరియు విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ చేసేవాడు.కాని ఇప్పుడు చిత్ర యూనిట్‌ సభ్యులతో కూడా టచ్‌ లో లేకుండా వెళ్లాడట.

నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతిలో రాజమౌళి ఉండాలని భావిస్తున్నారట.కరోనా కారణంగా ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇమ్యూనిటీ పవర్‌ తగ్గిందట.

Advertisement

దాంతో పూర్తి విశ్రాంతిలో ఉండాలని భావిస్తున్నారట.ప్లాస్మా దానంకు ముందుకు వచ్చిన జక్కన్నను డాక్టర్లు కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందిగా సూచించారట.

కరోనా నుండి పూర్తిగా కోలుకున్న జక్కన్న షూటింగ్‌కు వస్తాడని ప్రేక్షకులు భావించారు.కాని ఈ ఏడాది చివరి వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ ను చేసేది లేదు అంటూ తేల్చి చెప్పాడు.

ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు.రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నాడు.ఇక ఈ చిత్రంలో ఆలియా భట్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

Hair winter : వింటర్ లో ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సిందే.. మిస్ అయితే చాలా నష్టపోతారు!
Advertisement

తాజా వార్తలు