సీనియర్స్ పై విరుచుకుపడ్డ రాహుల్ !

సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వలేమి కారణంగా ప్రస్తుతం దేశంలో రోజు రోజుకి కుచించుకుపోతూ త్వరలోనే కనుమరుగయ్యే స్టేజ్ కి చేరనున్నది.

ఈ అవాంతరాలు నుండి పార్టీని కాపాడడానికి చాలా రోజుల తర్వాత సీడబ్ల్యూసీ మీటింగ్ కి పిలుపునిచ్చింది.

కరెక్ట్ గా ఈ మీటింగ్ జరిగే ఒకరోజు ముందు కాంగ్రెస్ లోని 23మంది సీనియర్స్ ప్రస్తుతం తాత్కాలిక వర్కింగ్ ప్రెసిడెంట్ సోనియాగాంధీకి ఓ లేఖ రాశారు.ఇందులో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు కోరారు.

దీనిపై తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు.తాను రాజీనామా చేశాక ఆ పదవిని చేపట్టాడానికి సోనియాగాంధీ అంగీకరించలేదని ఆ సమయంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఆమెను ఆ పదవిని తీసుకునేలా తాత్కాలికంగా ఒప్పించారని మరి అలాంటి నాయకులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు లేఖ రాయడం ఏంటని రాహుల్ సీనియర్ నాయకుల వ్యవహార శైలిపై ఫైర్ అయ్యారు.

పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు సీనియర్స్ పార్టీ నాయకత్వంపై ఇలాంటి విమర్శలు చేయడం ఏంటని పార్టీ సీనియర్స్ ను రాహుల్ నిలదీశారు.సీడబ్ల్యూసీలో చర్చించాల్సిన పార్టీ అంతర్గత విషయాలను మీడియాలో ఎలా చర్చిస్తారని ఆయన సీడబ్ల్యూసీ సభ్యుల పై మండిపడ్డారు.

Advertisement
కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?

తాజా వార్తలు