టాప్-10 లో తొలిసారి స్థానాన్ని కోల్పోయిన పీవీ సింధు.. ఖాతాలో వరుస ఓటములు..!

ఇటీవలే 2023 బ్యాట్మింటన్( Badminton ) సీజన్లో ప్రపంచ మాజీ ఛాంపియన్ పీవీ సింధు ( PV Sindhu )తన కెరీర్లో తొలిసారి టాప్-10 ర్యాంకింగ్స్ లో స్థానాన్ని కోల్పోయింది.

తాజాగా 4 టోర్నీల ప్రారంభ రౌండ్ లోనే వరుస ఓటములను ఖాతాలో వేసుకుంది.

తాజా ర్యాంకింగ్స్ ప్రకారం సింధు 11వ స్థానంలో నిలిచింది.గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ర్యాంకు, గడిచిన మూడు నెలల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో వరస ఓటములతో డీలా పడిపోయింది.

గత రెండు సంవత్సరాలుగా పీవీ సింధు వరుస ఓటములతో ఖాతాలో వేసుకుంటోంది.ప్రతిసారి కోచ్ లను మార్చిన కూడా ఫలితం మాత్రం శూన్యం.2016 నుండి కాపాడుకుంటూ వస్తున్న ర్యాంకింగ్, తాజాగా 60,448 పాయింట్లతో 11వ స్థానానికి దిగజారింది.

Pv Sindhu, Who Lost Her Position In The Top-10 For The First Time , Pv Sindhu, T

2023లో ఇంగ్లాండ్ లోని బర్నింగ్ హమ్ వేదికగా జరిగిన ఆల్ - ఇంగ్లాండ్ ఓపెన్ తొలి రౌండ్ లోనే సింధు ఓటమిని చవిచూసింది.తర్వాత వరుసగా మూడు ఓటములు ఖాతాలో వేసుకుని, స్విస్ ఓపెన్ లో జరిగిన నాలుగో టోర్నీ లో సైతం చివరికి ఓటమే దక్కింది.ఎన్నొ ప్రపంచ టైటిల్స్, ఒలంపిక్స్ పతకాలు సాధించిన పీవీ సింధుకు ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ ( All England title )మాత్రం అందని ద్రాక్షలా మారింది.ఈ టైటిల్ కొట్టడానికి గత మూడు సంవత్సరాలుగా ఎంత ప్రయత్నించినా తొలి రౌండులోనే ఓటమి పాలవుతోంది.27 సంవత్సరాల వయసు ఉన్న పీవీ సింధు ఫిట్నెస్ కష్టాలతో పాటు, ప్రత్యర్థుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది.పారిస్ ఒలంపిక్స్( Paris Olympics ) కు నేరుగా అర్హత సాధించాలంటే ప్రపంచం మొదటి ఐదు ర్యాంకుల్లో ఒకరిగా ఉండాలి.

Advertisement
PV Sindhu, Who Lost Her Position In The Top-10 For The First Time , PV Sindhu, T

కాబట్టి ప్రస్తుతం పీవీ సింధు కు రానున్న కాలం పరీక్షా సమయం అనే చెప్పాలి.గతంతో పోలిస్తే సింధు ఆట తీరు చతికిల పడ్డట్టే అని తెలుస్తుంది.

త్వరలోనే పీవీ సింధు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు