డబ్బులు చేతిలో ఉంటే పూరి అస్సలు ఆగడుగా..!

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ చాలా కాలం తర్వాత కమర్షియల్‌గా క్రేజ్‌ పరంగా ఇస్మార్ట్‌ శంకర్‌తో సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో దాదాపుగా 20 కోట్ల వరకు పూరికి లాభాలు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

అంతకు ముందు వరకు ఆయన సినిమాలు నష్టాలను మిగల్చాయి.ఇప్పుడు ఆయన నష్టాల తాలూకు అప్పులు అన్ని తీర్చేశాడు.

ప్రస్తుతం ఆయన చేతిలో డబ్బులు గల గల అంటున్నాయి.

Purijaganath New Office In Mumbai

డబ్బులు ఉన్నప్పుడు పూరి అస్సలు ఆగడు అనే టాక్‌ ఉంది.అన్నట్లుగానే పూరి జగన్నాధ్‌ ప్రస్తుతం ముంబయిలో ఒక భారీ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నాడు.హైదరాబాద్‌లో కేవ్‌ అంటూ ఒక ఆఫీస్‌ను పూరి మెయింటెన్‌ చేస్తుంటాడు.

Advertisement
Purijaganath New Office In Mumbai-డబ్బులు చేతిలో ఉ�

ఆ ఆఫీస్‌ హైదరాబాద్‌లో ఉండే దర్శకుల ఆఫీస్‌లన్నింటిలోకి చాలా గొప్పగా ఉంటుంది.ఇప్పుడు అదే తరహాలో ముంబయిలో కూడా ఒక భారీ ఆఫీస్‌ను నిర్మించే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ముంబయిలోని ఒక ఖరీదైన ఏరియాలో ఈ ఆఫీస్‌ ఏర్పాటు చేయబోతున్నారు.

Purijaganath New Office In Mumbai

కేవ్‌ను మించి దాదాపుగా అయిదు కోట్లతో ఆఫీస్‌ డిజైన్‌ చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.రెండు సంవత్సరాలకు గాను ఒక భవనంను లీజ్‌కు తీసుకున్న పూరి దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాడట.ఇంతకు ముంబయిలో ఈయనకు ఎందుకు ఆఫీస్‌ అనుకుంటున్నారా.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న సినిమాను తెలుగుతో పాటు హిందీలో నిర్మిస్తున్నాడు.ఇదే సమయంలో హిందీలో సినిమాలను నిర్మించడంతో పాటు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించే ఉద్దేశ్యతో కూడా పూరి ఉన్నాడట.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
నేషనల్ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నానన్న సాయిపల్లవి.. ఆ అదృష్టం వరిస్తుందా?

అందుకే అక్కడ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు