ప్రజావాణితో సమస్యలు పరిష్కారం-కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 122 దరఖాస్తుల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణిలో వచ్చే సమస్యలు పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

Problems Solved With Public Opinion-Collector Sandeep Kumar Jha Received A Total

పెండింగ్లో పెట్టవద్దని స్పష్టం చేశారు.మొత్తం 122 దరఖాస్తులు వచ్చాయి.

రెవెన్యూ 67, సిరిసిల్ల మున్సిపల్ 18, జిల్లా పంచాయతీ అధికారి2, జిల్లా వైద్యాధికారి 2, జిల్లా సంక్షేమ అధికారి 4, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ 3, ఎస్సీ కార్పొరేషన్ 1, ఎస్సీ సంక్షేమ అధికారి 4, ఎస్ డి సి 5, డిఆర్డిఓ, వ్యవసాయ శాఖకు 2 చొప్పున, పౌరసరఫరా శాఖకు 3, విద్యాశాఖ, మత్స్యశాఖ, నీటిపారుదల శాఖ, ఎస్పీ ఆఫీస్, ఉపాధి కల్పన శాఖ, ఎంపీడీవో కొనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట తంగల్లపల్లికి ఒకటి చొప్పున, వచ్చాయి.ప్రజావాణిలో ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News