అయోధ్య రామాల‌య నిర్మాణానికి రాష్ట్రపతి విరాళం

అయోధ్య రామమందిర నిర్మాణంలో గత కొన్ని ఏండ్లుగా నెలకొన్న మతపరమైన సమస్యలకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే.

యావత్ భారతదేశ హిందూ ప్రజలు ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశారు.

ఇక ఆలయ నిర్మాణ పనులను కేంద్రం ఇటీవలే  ప్రారంబించింది.  నరేంద్ర మోడి అయోధ్య రామాలయం నిర్మాణ భూమి పూజను  ఘనంగా జరిపించాడు.

నేటి నుండి ఆలయ నిర్మాణం కోసం నిధులను సేకరిస్తున్నారు.అందుకు రెండు దశాలుగా విరాళాలను సేకరించనున్నారు.

వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థలు ఈ బాద్యతను తీసుకున్నాయి.జనవరి 15 నుండి 31 వరకు విరాళాల ను సేకరిస్తారు.

Advertisement

ఇందులో దేశంలోని ధనవంతులు ఈ లిస్ట్ లోకి వస్తారు.ఫిబ్రవరి 1 నుండి 27 వరకు రెండో దశ విరాళాల సేకరణ ఇందులో సామాన్య ప్రజలు ఉంటారు.

ప్రతి ఒక్కరిని రాముడి ఆలయ నిర్మాణంలో భగస్వామ్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

విరాళం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రశీదులను ఇవ్వాలని అందుకు ప్లాన్ ను సిద్దం చేస్తుంది. 44 రోజుల పాటుగా ఈ విరాళాల సేకరణ రెండు దశల్లో జరుగుతుంది.వీహెచ్‌పీ ట్రస్ట్ నేత అలోక్ కుమార్ మరియు రామ్‌ మందిర్‌ నిర్మాణ్‌ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరిలు తదితరులు కలిసి మొదట విరాళంగా దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ ను కలుసుకున్నారు.ఈ నేపథ్యంలో ఆయన 5.01,000 రూపాయల చెక్ ను అందజేశాడు.ఈ మొత్తం చెక్ ను వీహెచ్‌పీ నేత అలోక్ కుమార్ మీడియా ముఖంగా చూపించాడు.

రాష్ట్ర పతి దేశ ప్రథమ పౌరుడు కావున మొదటి విరాళంగా రామ్ నాథ్ కొవింద్ ను కలవడం జరిగిందని తెలిపాడు.

పైసా ఖర్చు లేకుండా స్కిన్ పిగ్మెంటేషన్ ను వదిలించుకోవడం ఎలాగో తెలుసా?
Advertisement

తాజా వార్తలు