Rajanna Sircilla : పల్లె నుండి ప్రతిమ మెడికల్ కళాశాల ఉచిత బస్ను ప్రారంభించిన ప్రతిమ మెడికల్ కళాశాల ఏరియా కో ఆర్డినేటర్ ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్ల పల్లె నుండి నగునూర్ ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రతిమ మెడికల్ కళాశాల ఏరియా కో ఆర్డినేటర్, ఎల్లారెడ్డిపేట మండల ఇంచార్జీ ఒగ్గు బాలరాజు యాదవ్ రాగట్ల పల్లె గ్రామ ప్రజల సౌకర్యార్థం ఉచిత మెడికల్ బస్ సౌకర్యం( Free Medical Bus ) ను ప్రారంబించారు.

రాగట్లపల్లె నుండి ప్రతిమ మెడికల్ కళాశాల కు బస్ సౌకర్యం కల్పించిన ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) ను గ్రామస్థులు శాలువా కప్పి సన్మానించారు.

ప్రతి శుక్రవారం బస్ సౌకర్యం ప్రతిమ మెడికల్ కళాశాల కు వెళ్తుందని ఇట్టి అవకాశం రాగట్లపల్లె గ్రామస్థులు వినియోగించుకోవాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మందాటి లక్ష్మణ్,మందాటీ రాము, మందాటి లక్ష్మణ్ తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Pratima Medical College Area Coordinator Oggu Balaraju Yadav Started Free Bus F
వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

Latest Rajanna Sircilla News