Prabhas : మోకాలికి సర్జరీ చేయించుకుంటున్న ప్రభాస్.. ఆందోళన చెందుతున్న అభిమానులు?

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రభాస్( Prabhas ) సినిమాలు అయితే విడుదల అవుతున్నాయి కానీ ప్రభాస్ పూర్తి స్థాయిలో డ్యాన్స్ చేసి చాలా ఏళ్లు అయిందని చెప్పవచ్చు.

ప్రభాస్ డాన్స్ చేసిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఏవి లేవు అని చెప్పవచ్చు.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.

ప్రభాస్‌కు మోకాలు సమస్యే అసలు సమస్య.కొంతకాలంగా మోకాలి సమస్యలతో బాధపడుతున్న ప్రభాస్ ఇంతకాలం ఇంజక్షన్లు మందులతో నెట్టుకు వచ్చారు.

అలాగే ప్రతి మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి విదేశాలకు వెళ్లి తాత్కాలిక చికిత్స చేయించుకుని వస్తున్నారు.కానీ ప్రతిసారి ఇలా వెళ్లకుండా ఆ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నారట ప్రభాస్.ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె( Salar, Project K ) పనుల్లో బిజీగా వున్నారు.

Advertisement

ఈ పనులు పూర్తి కాగానే వెంటనే సర్జరీ చేయించుకుని, రెండు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో అభిమానులు ప్రభాస్ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు.

బాహుబలి సినిమా సమయంలో మొదలైన ఈ నొప్పి ప్రభాస్ ను అప్పటి నుంచి వేధిస్తూనే ఉందట.

రోప్ ఫైట్ల వల్ల వచ్చిన సమస్య ఇది.ఆ మధ్య అయితే పక్కన మనిషి పట్టుకుంటే తప్ప ప్రభాస్ నడవలేకపోయారు.ఆదిపురుష్ టీజర్ లాంచ్ టైమ్ లో ఇది క్లియర్ గా తెలిసింది.

ఇంట్లో అయితే ప్రభాస్ హ్యాండ్ స్టిక్ సాయం తీసుకుంటారని, మోకాలిపై భారం పడనివ్వరని వార్తలు వినిపించాయి.మోకాలి సమస్య వచ్చినప్పటి నుంచి ప్రభాస్ పాటల్లో డ్యాన్స్ చేయడం అన్నది తగ్గిపోయింది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఇప్పుడు చేస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె రెండూ పాటలకు అంతగా ప్రాముఖ్యత వున్న సినిమాలు కాదు.కానీ మారుతి దర్శకత్వంలోని సినిమాలో అయిదు పాటలు వుంటాయి.కనీసం రెండింటిలో అయినా డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

డాన్స్ చేయాలనీ ప్రభాస్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు