తెలుగు స్టార్ హీరోతో పూజా డేటింగ్..?

టాలీవుడ్ అందాల భామ పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారి ప్రతి స్టార్ హీరో సరసన నటిస్తోంది.

వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ బ్యూటీ, ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తనదైన మార్క్ వేస్తూ దూసుకుపోతుంది.

ఇప్పటికే పలు సినిమాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ, ఇప్పుడు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.అయితే పూజా హెగ్డే టాలీవుడ్‌లో ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆయన 20వ చిత్రంలో నటిస్తోంది.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకోవడానికి పూజా రెడీ అయ్యింది.

కాగా ఈ బ్యూటీ టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న పూజా, ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Advertisement

వారిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు పలు వెబ్‌సైట్లలో వార్తలు రావడంతో ఇది నిజం కావచ్చని చిత్రపురిలో టాక్ వినిపిస్తోంది.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం పూజా నోరు విప్పే వరకు ఆగాల్సిందే.

ఇక బాలీవుడ్‌లో తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో తెరకెక్కించేందుకు పూజా రెడీ అవుతోంది.మరి ప్రభాస్ 20వ చిత్రంలో ఈ బ్యూటీ ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు