ఈటలను చూసైనా నేర్చుకోండయ్య.. పొన్నం ప్ర‌భాక‌ర్ కొత్త డిమాండ్.. !!

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజీనామా వ్యవహారం కొత్త మలుపు తిరగనుందా అనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటుందట.

నిజానికి ఈటల రాజకీయ జీవితం ఇలా మలుపు తిరుగుతుందని కలలో కూడా ఏ నాయకుడు ఊహించలేదు.

ఈటల పై ఆరోపణలు రావడం.మంత్రి పదవి నుండి తొలగడం.

Ponnam Prabhakar New Demand Telangana, Congress, Ponnam Prabhakar, New Demand-�

చివరికి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించడం ఇవన్ని చకా చకా జరిగిపోయాయి.ఈ నేపధ్యంలో కొత్త డిమాండ్ తెర‌పైకి వ‌చ్చింది.

ఇప్పటి వరకు వేరే పార్టీల్లో గెలిచి గులాభి పార్టీ పంచన చేరి పదవులు అనుభవిస్తున్న వారందరు ఈటలను చూసి నేర్చుకోవాలని, ఆయనలా రాజీనామా చేసి మళ్ళీ పోటీలో నిలబడాలని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ సవాల్ విసురుతున్నారట ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే లు కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేన‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు.అయినా ఈటల ప్రజాబలం చూసుకుని అంతటి సాహసానికి దిగారు కానీ ఇప్పుడున్న నేతలకు అంత దమ్ము, ధైర్యం ఎక్కడివి అని అనుకుంటున్న వారు కూడా ఉన్నారు.

Advertisement
కుటుంబంలో గొడవలు మనోజ్ ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి... వీడియో వైరల్!

తాజా వార్తలు