నేడు ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్‌ ప్రారంభం... ఎక్కడో, దాని ప్రత్యేకతలు తెలుసా...?

ప్రపంచంలో అతిపెద్ద సొరంగ మార్గం ఎక్కడ ఉందో అని ఆలోచిస్తున్నారా.? ఎక్కడో కాదండి మన భారతదేశంలోనే ఉంది.

అవును భారతదేశం తాజాగా ఈ రికార్డును సాధించింది.

హిమాచల్ రాష్ట్రంలోని రోహ్‌తాంగ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గాన్ని నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.ఈ అతి పొడవైన సొరంగ మార్గాన్ని అటల్ టన్నెల్ గా నామకరణం చేశారు.

PM Modi Inaugurates The World's Longest Highway Tunnel In Rohtang, Prime Ministe

నేడు నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమం తర్వాత అందులో మోడీ ప్రయాణం చేయబోతున్నారు.ఇక ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని భారతదేశ ప్రభుత్వం ఏకంగా రూ.3500 కోట్లు ఖర్చు పెట్టి 9.2 కిలోమీటర్ల దీనిని నిర్మించారు.ఇలా ఈ టన్నెల్ సముద్రమట్టానికి ఏకంగా 10213 అడుగుల ఎత్తులో ఉంది.

ఇక ఈ టన్నెల్ ను లఢక్ లోని లేహ్‌ నుండి మనాలి వరకు నిర్మించారు.ఈ భారీ నిర్మాణం ద్వారా ఏడు గంటల రోడ్డు ప్రయాణ సమయం మిగలడమే కాకుండా 45 కిలోమీటర్ల దూరాన్ని కూడా తగ్గించవచ్చు.

Advertisement

అంతేకాదు ఆ ప్రాంతంలో ఎక్కువగా మంచు కురిసే ప్రాంతం అవ్వగా, ఇది సొరంగ మార్గం కావడంతో ఎటువంటి మంచు ఇందులోకి చేరదు.దీంతో వాహనదారులు ఆ ప్రాంతంలో హ్యాపీగా ప్రయాణం చేయవచ్చు.

వీటితోపాటు ముఖ్యంగా భారత దేశ ఆర్మీకి ఈ సొరంగ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇక ఈ నిర్మాణానికి ఆస్ట్రియా దేశపు టన్నెలింగ్‌ విధానంలో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించారు.ఈ ఛానల్ ను కట్టడానికి 14 వేల టన్నులకు పైగా ఉక్కును ఉపయోగించారు.2002లో అటల్‌ బిహారీ వాజపేయి ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఆయనకు గుర్తుగా గత ఏడాది డిసెంబర్ నెలలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్మాణానికి అటల్ టన్నెల్ అనే పేరును నామకరణం చేశారు.

Advertisement

తాజా వార్తలు