Praneet Rao: తెలంగాణ హైకోర్టుకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు( SIB DSP Praneet Rao ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు ప్రణీత్ రావు పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రణీత్ రావు పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది.కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో( phone tapping case ) ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

పోలీస్ కస్టడీకి ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్ చేశారు.ఈ క్రమంలోనే వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుడా తనను కస్టడీకి ఇచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు.

కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ప్రణీత్ రావు తరపు న్యాయవాది ఆరోపించారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు