పెట్రోల్ బంకులు కనీస వసతుల్లేవ్...24 గంటల సర్వీస్ లేదు...!

సూర్యాపేట జిల్లా:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల( Central , State Govts ) నిభంధనల ప్రకారం నడవాల్సిన పెట్రోల్ బంకుల్లో( petrol stations ) కనీస వసతులు లేక,24 గంటల సర్వీస్ ఇవ్వకుండా బంకుల యజమానులు ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బంకుల్లోసౌకర్యాలు ఉండవు,రాత్రి అయితే మూసేయడం లాంటివి నిత్యకృత్యంగా మారిందని,సిరికొండ గ్రామంలోని ఇందిరా ఫిల్లింగ్ స్టేషన్ సౌకర్యాలు లేకుండానే నడిపిస్తూ, సౌకర్యాలు ఉన్నట్టు మనుగడలో లేని పరికరాలు ఏర్పాటు చేయడంతో వాహన చోదకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని బంకులు 24 గంటల సర్వీస్ అందించేలా, త్రాగునీరు,బాత్రూం, ఎయిర్ చెకప్ లాంటి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్

Latest Suryapet News