ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తామ ఓటు హక్కు ధైర్యంగా ,స్వేచ్ఛగా వినియోగించుకునెలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా జిల్లాలో కేంద్ర సాయుధ బలగాలు, జిల్లా పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించడం జరుగుతుందని,ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎస్పీ( Akhil Mahajan ) అన్నారు.

సిరిసిల్ల పట్టణంలో కొత్త చెరువు నుండి రాళ్లబావి, పెద్దబజార్ ,గాంధీ మీదుగా,పోలీస్ స్టేషన్ వరకు సాగిన ఫ్లాగ్ మార్చ్.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 13 వ తేదీన జరుగు పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections) నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా స్థానిక పోలీసులు, మరియు కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత, భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ గారు తెలిపారు.

People Should Exercise Their Right To Vote With Courage And Freedom,, Akhil Maha

రేపటి సాయంత్రం నుండి 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎవరు కూడా గుంపులు గుంపులుగా బయట తిరగవద్దని,రేపటి సాయంత్రం నుండి సైలెంట్ పీరియడ్ మొదలు అవుతుందని ఎవరు కూడా నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించకూడదని,అలా ఎవరైనా చేస్తే సమాచారం అందించాలని అన్నారు.ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, డిఎస్పీ లు చద్రశేఖర్ రెడ్డి,నాగేంద్రాచరి, సి.ఐ లు ఎస్.ఐ లు, జిల్లా పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు ఉన్నాయి.

Advertisement

Latest Rajanna Sircilla News