వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చెరువులు, వాగులు, కల్వర్టులను ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి పరిశీలించారు.

గురువారం భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సమస్యలు తలెత్తితే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.మండలంలోని రామలక్ష్మణ పల్లి, గూడూరు, గూడెం, పోతుగల్ చెరువులు, వాగులు, నామాపూర్, ఆవునూరు, కోదాటివానిపల్లి, గ్రామాల్లో నీటి ఉధృతి పెరిగింది అని చెరువులు అలుగులు పారుతున్నాయని అన్నారు.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వరద ఉధృతి బాగా ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేతకు జిపి ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భారీ వర్షాలకు ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలను సలహాలను ప్రజలకు అందించారు.

Advertisement

Latest Rajanna Sircilla News