పవన్ కంట్రోల్ లోకి బాబు వెళ్తున్నారా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ ఇప్పుడు రాజకీయాల్లో బాగా పెరిగింది.

రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన కీలకం కాబోతూ ఉండడం తో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దూరం చేయాలంటే జనసేన మద్దతు తప్పనిసరిగా ఉండాలనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీతో పాటు ,అటు బీజేపీ లోనూ వ్యక్తమవుతూ ఉండడం , ఇలా ఎన్నో కారణాలు పవన్ ఇమేజ్ ను,  జనసేన పార్టీ అవసరాన్ని బాగా పెంచేశాయి.

అది కాకుండా క్షేత్రస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీతో ఖచ్చితంగా పొత్తు ఉండాలి అంటూ పదే పదే డిమాండ్ చేస్తుండటం, ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లోనూ స్థానికంగా తీసుకున్న నిర్ణయం మేరకు జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, ఇలా ఎన్నో కారణాలతో రాబోయే ఎన్నికల్లో జనసేన తో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే అభిప్రాయం క్షేత్ర స్థాయి నాయకుల నుంచి వ్యక్తమవుతోంది.అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేన పార్టీతో పొత్తు ఉంటే తప్ప,  తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రాదు అనే అభిప్రాయం పెరిగిపోవడంతో జనసేన కు - పవన్ కు ఈ స్థాయిలో క్రేజ్ పెరగడానికి కారణమైంది.

ఇప్పుడు జనసేన పొత్తు ఉండాల్సిందే అనే అభిప్రాయం తెలుగుదేశం నేతలే ఎక్కువగా చేస్తున్నారు.మాజీ శాసన మండలి మాజీ చైర్మన్ దగ్గర నుంచి మాజీ మంత్రులు,  ఎమ్మెల్యేలు , నియోజకవర్గ స్థాయి నాయకులు ఇలా అంతా జనసేన డిమాండ్ బాగా పెంచేశారు.

దీంతో రాబోయే రోజుల్లో టిడిపి,  జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఖచ్చితంగా పవన్ సీట్ల విషయంలో ఎక్కువ డిమాండ్ చేసినా,  ఆ డిమాండ్ లను నెరవేర్చాల్సి పరిస్థితి టిడిపికి వచ్చిపడింది.

Pawan Kalyan Is In Control Of The Tdp In The Coming Days Pavan Kalyan, Tdp, Bjp,
Advertisement
Pawan Kalyan Is In Control Of The Tdp In The Coming Days Pavan Kalyan, TDP, Bjp,

ఎందుకంటే జనసేన సహకారం లేకపోతే 2024 ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లేదనే అభిప్రాయం పార్టీ కేడర్ లోకి వెళ్ళిపోయింది.దీంతో తప్పనిసరిగా జనసేన డిమాండ్లకు తలోగ్గాల్సిందే.అలా కాకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళితే టిడిపి కనుక మళ్ళీ ఓటమి పాలు అయితే ఇక పార్టీని పూర్తిగా ముసేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయం అటు చంద్రబాబులోనూ నెలకొనడంతో తప్పనిసరిగా జనసేన షరతులకు తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది.

తొందరలోనే ఈ రెండు పార్టీల పొత్తుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉండడం తో ఈ తరహా చర్చలు ఎక్కువయ్యాయి.

Advertisement
" autoplay>

తాజా వార్తలు