మెగా ఫ్యాన్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం.. ఏమైందంటే?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయాలలో ఎంతో బిజీగా మారుతూ రాజకీయ ప్రసంగాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

ఈయన సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ రాజకీయాలలోకి అడుగు పెట్టారు.

ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం( Deputy CM ) గా బాధ్యతలు తీసుకున్నారు.ఇలా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తరుణంలో ఈయనకు సినిమాలు చేసే తీరికలేదు.

దీంతో ఈయన కమిట్ అయిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.

Pawan Kalyan Gives Strong Warning To Mega Fans, Pawan Kalyan, Mega Fans, Warning

ఇలా తమ అభిమాన హీరో సినిమాలు చేయరనే విషయం అభిమానులకు కాస్త నిరుత్సాహం కలిగించిన ఈయన కమిట్ అయి షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారనే సందేహం కూడా అందరిలోనూ ఉంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈయన కమిట్ అయిన సినిమాల దర్శకులు నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయన డేట్స్ గురించి అడిగినట్లు సమాచారం త్వరలోనే పవన్ కళ్యాణ్ పలు సినిమాలో షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.

Pawan Kalyan Gives Strong Warning To Mega Fans, Pawan Kalyan, Mega Fans, Warning
Advertisement
Pawan Kalyan Gives Strong Warning To Mega Fans, Pawan Kalyan, Mega Fans, Warning

తాజాగా ఒక ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున ఓజీ సినిమా( OG Movie ) గురించి అప్డేట్ ఇవ్వాలి అంటూ కేకలు వేశారు.దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తన ప్రసంగం ఆపివేసి.సినిమాల గురించి సినిమా థియేటర్లోనే చూసుకోండి.

నేను సినిమాలను రాజకీయాలను భిన్నంగా చూస్తానని తెలిపారు.ఒకవేళ నేను రాజకీయాలకు దూరంగా ఉండి సినిమాలలో ఉంటే కనుక తప్పకుండా సినిమాల గురించే మాట్లాడేవాడిని కానీ ప్రస్తుతం నా దృష్టి మొత్తం రాజకీయాలపైనే ఉందని, ప్రస్తుతం నాకు సినిమాల కంటే కూడా దేశమే ముఖ్యమని తెలిపారు.

గ్రామహితం ముఖ్యం అన్నం పెట్టే రైతు బాగుంటేనే అన్ని బాగుంటాయి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మెగా అభిమానులను ఉద్దేశిస్తూ వారికి వార్నింగ్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు