ఒక వైపు సినిమా సెట్ నిర్మాణం మరో వైపు యాత్ర బస్ నిర్మాణం.. పవన్‌ ఏంటీ ఈ గందరగోళం?

పవన్ కళ్యాణ్ ఒక వైపు వరుసగా సినిమాలను కమిట్ అవుతూనే మరో వైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు జనసేన పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

ఆర్థికంగా బలపడేందుకు వరుసగా సినిమాలను చేసేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారు.

కానీ ఆయన రాజకీయాలతో పోలిస్తే సినిమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేక పోతున్నారు.దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పటికి కూడా పూర్తి చేయలేక పోయాడు.

వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో షూటింగ్ కి డేట్ లు ఇస్తానంటే ప్రస్తుతం దర్శకుడు క్రిష్ అందుకు సంబంధించిన సెట్టింగ్ నిర్మిస్తున్నాడని సమాచారం అందుతుంది.మరో వైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతం కోసం బస్సు యాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడు.

దసరా నుండి తన బస్సు యాత్ర ఉంటుందని జనసేన వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.అందుకోసం హైదరాబాదులో బస్సు కూడా రెడీ అవుతోంది.

Advertisement

గతంలో ఎన్టీఆర్ బస్సు యాత్రకు వినియోగించిన తరహా వాహనం ను పవన్ కళ్యాణ్ యాత్ర కోసం రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.ఒక వైపు హరిహర వీరమల్లు షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరో వైపు బస్సు యాత్రకు బస్సు రెడీ అవుతోంది.మరి ఈ రెండిట్లో ఏది ముందుంటుంది.

ఈ రెండు ఒకేసారి ఎలా సాధ్యమవుతాయి అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు జుట్టు పీక్కుంటున్నారు.పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసి బస్సు యాత్రలో పాల్గొంటాడా అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది.

కేవలం హరిహర వీరమల్లు సినిమానే కాకుండా మరో రెండు మూడు సినిమాలకు కూడా పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యి అడ్వాన్స్ తీసుకున్నాడు.ఆ సినిమాల షూటింగ్ లు ఎప్పుడు జరుగుతాయో.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

బస్సు యాత్ర ఎప్పుడు ఉంటుందో ఆ పవన్ కళ్యాణ్ కి తెలియాలి.

Advertisement

తాజా వార్తలు