సెన్సార్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్.. రచ్చ చేస్తున్న అభిమానులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అందరికీ పూనకాలు వచ్చేస్తాయి.

ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఎంతో నేర్పుగా తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు.

పవన్ రీ ఎంట్రీ "వకీల్ సాబ్" సినిమా తర్వాత రాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా "భీమ్లా నాయక్". ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు రిలీజ్ అయ్యి ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేశాయి.

"భీమ్లా నాయక్ " సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కరోనా కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Pawan Kalyan Bheemla Nayak Completes Censorship Details, Bheemla Nayak, Tollywo

ఇటీవలే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇవ్వటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Pawan Kalyan Bheemla Nayak Completes Censorship Details, Bheemla Nayak, Tollywo

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ , ట్రైలర్ రిలీజ్ ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న రోజు త్వరలోనే రాబోతోంది.ఈ సారి పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీసు వద్ద ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు