Patel Community : కూతురి కాళ్లు పట్టుకున్న తల్లిదండ్రులు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

భారత్‌లో కనిపించే సనాతన సంప్రదాయాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు.హిందూ మతంలో వివాహ వ్యవస్థలో గొప్పదనం మరెక్కడా కనిపించదు.

పెళ్లి చూపులు, నిశ్చితార్ధం నుంచి కూతురి వీడ్కోలు వరకు పుట్టింటి వారు చాలా శ్రమిస్తారు.వివాహ వేడుకను ఘనంగా చేయాలని తలంచుతారు.

అంతేకాకుండా మగపెళ్లి వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటారు.పెళ్లి కొడుకు తరుపు వారు అడిగినంత కట్నం అప్పు చేసైనా ఇస్తారు.

అంతేకాకుండా ఇతర లాంఛనాలకు ఏ మాత్రం తగ్గకుండా అడిగింది అందిస్తారు.అప్పటి వరకు అపురూపంగా చూసుకున్న తమ కుమార్తెకు మెట్టినింట్లో కూడా అంతే ప్రేమాభిమానాలు, గౌరవం లభిస్తుందని అనుకుంటున్నారు.

Advertisement

ఇక భారతీయ వివాహ వేడుకల్లో ప్రాంతాలకు అనుగుణంగా ఎన్నో ఆచారాలు ఉన్నాయి.దేశంలో చాలా చోట్ల వధువు తల్లిదండ్రులు వరుడి కాళ్లను పెళ్లిలో ఓ ఆచారంగా కడుగుతుంటారు.

అయితే పెళ్లి కుమార్తె కాళ్లను కడగడం( Washing the brides feet ) అనే సంప్రదాయం ఎక్కడా విని ఉండరు.అలాంటిది కూడా మన దేశంలో పాటిస్తారు.

ఈ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం.

మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు పదహారు సంస్కారాలు ఇవ్వబడ్డాయి.ఈ పదహారు సంస్కారాలలో వివాహ సంస్కారం( Marriage ceremony ) ఒకటి.పెళ్లి అనేది ఒక బంధం మాత్రమే కాదు.

నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే
వైరల్ వీడియో : ఏంటి భయ్యా.. బతికున్న నల్లత్రాచుకు నేరుగా పూజలు చేస్తున్న కుటుంబం..

పెళ్లైన నాటి నుంచి చనిపోయే వరకు కలిసి ఉంటామని ఒక జంట చేసే వాగ్దానం.వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు ఆత్మల కలయిక.

Advertisement

పెళ్లయ్యాక అతని జీవితంలో ఆసరాగా నిలిచే జీవిత భాగస్వామి అతని భార్య మాత్రమే కాదు, అతని ఇంటి ఇంటి లక్ష్మి.పెళ్లి సందర్భంగా రకరకాల ఆచారాలు పాటిస్తాం కానీ వాటన్నింటికీ అర్థం తెలుసుకోవడం కూడా ముఖ్యం.

పెళ్లిలో వరుడి కాళ్లను వధువు కుటుంబికులు కడగడం ఎన్నో ఏళ్లుగా చాలా ప్రాంతాల్లో ఆచారంగా వస్తుంది.అయితే పెళ్లి కుమార్తె కాళ్లను కడగడం మనం ఎక్కడా విని ఉండం.

కానీ గుజరాత్‌లోని కచ్ ( Kutch in Gujarat )ప్రాంతం పటేల్ కమ్యూనిటీలో( Patel community ) ఈ సంప్రదాయం ఉంది.

దీని వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయి.పెళ్లిలో వధువు కాళ్లపై ఆమె కుటుంబికులు పడి ఏడుస్తారు.ఎందుకంటే ఇప్పటి వరకు తమ పెంపకంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే క్షమించమని అడుగుతారు.

తాతామామ్మలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు అనే బేధం లేకుండా అందరూ వధువు కాళ్లపై పడతారు.అత్తారింటికి పంపే తమ కుమార్తెపై తమకు గల అభిమానాన్ని, ప్రేమను ఇలా వారు చాటుకుంటారు.

ఈ సంప్రదాయానికి సంబంధించిన వీడియోలు చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

తాజా వార్తలు