మహాసేన పేరుతో ఏపీలో బాగా ఫేమస్ అయిన సరిపెల్లె రాజేష్( Saripelle Rajesh ) ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది.మొదట్లో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కు, ఆ పార్టీకి మద్దతుగా ఉంటూ వచ్చిన సరిపల్లె రాజేష్ ను ఆ పార్టీ పక్కన పెట్టడంతో అప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ.
తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన ను టీడీపీ చేరదీసి వైసీపీకి వ్యతిరేకంగా ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే సరిపల్లె రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు .ఆయనకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ టికెట్( P.Gannavaram Assembly Ticket ) ను మొదట చంద్రబాబు కేటాయించారు.అయితే ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత రావడం, వివాదాస్పదం కావడంతో రాజేష్ ను ఆ సీటు నుంచి తప్పుకునేలా చేశారు.
ఆ సీటును పొత్తులో భాగంగా జనసేన కు కేటాయించారు.దీనిపై రాజేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ,తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ప్రకటించి సంచలనం రేపారు.అయితే ఈ వ్యవహారంతో చంద్రబాబు రంగంలోకి దిగి రాజేష్ ను తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు.
అంతే కాదు ఆయన ను టిడిపి స్టార్ క్యాంపైనర్ గా టీడీపి నియమించింది.అయితే కొద్దిరోజులకే ఆయన కూటమికి షాక్ ఇచ్చారు.మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కూటమిలో ఉన్న జనసేన పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నట్లు గా రాజేష్ ప్రకటించి , కూటమి పార్టీలో కలకలం రేపారు.
అంతే కాదు జనసేన( Janasena ) అభ్యర్థి ఓటమికి పనిచేస్తాను అని ప్రకటించారు.ఈ వ్యవహారం పై సీరియస్ అయిన తెలుగుదేశం అధిష్టానం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కూటమి లో ఉన్న జనసేన పార్టీ పై విమర్శలు చేస్తున్న మహసేన రాజేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు గా ప్రకటించింది.