సుప్రీత( Supritha ) పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి సురేఖవాణి( Surekha Vani ) కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే సురేఖవాణి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే తన కుమార్తెను అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈమె సినిమాలలోకి రాకముందే సుప్రీత భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు చేసే హంగామా మామూలుగా ఉండదు కొన్నిసార్లు వీరి వ్యవహారం భారీ స్థాయిలో ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటుంది.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ తల్లి కూతుర్లు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇద్దరు బిజీ అయ్యారని తెలుస్తుంది.సురేఖ వాణి సినిమా అవకాశాలను అందుకుంటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉండగా సుప్రీత మాత్రం హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటున్నారు.ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ దీప్( Amar Deep ) హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా సుప్రీత సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు.అంతేకాకుండా ఈ ఫోటోలకు సుప్రీత చేసిన కామెంట్స్ వైరల్ అవుతుంటాయి నా లైఫ్ లోకి వాళ్లు వస్తుంటారు వెళుతుంటారు లైఫ్ అంటే ఇదే అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు కానీ ఈమె చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది.