గంటలోనే 1,123 చెట్లను కౌగిలించుకున్న వ్యక్తి.. వరల్డ్ రికార్డు బద్దలు..?

ఘనాకు( Ghana ) చెందిన 29 ఏళ్ల విద్యార్థి, పర్యావరణ ప్రియుడు అబుబకర్ తాహిరు( Abubakar Tahiru ) తాజాగా ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.ఆయన ఒక గంటలో 1123 చెట్లను కౌగిలించుకున్నాడు.

 Ghana Man Sets World Record For Most Trees Hugged In One Hour Details, World Rec-TeluguStop.com

అంటే ఒక్క నిమిషంలో సుమారు 19 చెట్లను కౌగిలించుకున్నాడు! ఈ ఘనతను అమెరికాలోని అలబామాలోని టస్కెగీ నేషనల్ ఫారెస్ట్‌లో( Tuskegee National Forest ) సాధించాడు.రికార్డు నమోదు కావాలంటే, ప్రతి చెట్టును రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకోవాలి.

ఒకే చెట్టును రెండుసార్లు కౌగిలించుకోకూడదు లేదా చెట్లకు ఎటువంటి హాని చేయకూడదు.లేకపోతే ఈ రికార్డు మేకింగ్ ప్రక్రియలో అనర్హత వేటుకు గురవుతారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ( Guinness World Records ) అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ తాహిరు చెట్లను వేగంగా కౌగిలించుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది.ఆ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఒక 10 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.రంజాన్ ఉపవాసం ఉండటం వల్ల నీరు తాగలేదని అయినా వేగంగా అటు ఇటు ఉరుకుతూ చెట్లను కౌగిలించుకున్నానని( Hugging Trees ) అతను చెప్పాడు.వాటిని సరిగ్గా కౌగిలించుకోవడం చాలా కష్టంగా ఉందని తాహిరు తెలిపాడు.“ఈ ప్రపంచ రికార్డు సాధించడం చాలా ప్రత్యేకమైనది.చెట్లు మన ప్రపంచానికి ఎంత ముఖ్యమైనవో, పర్యావరణాన్ని ఎందుకు కాపాడుకోవాలో ఇది చూపిస్తుంది,” అని అతను అన్నాడు.

రికార్డు సాధించడానికి 700 చెట్లను కౌగిలించుకోవాల్సి ఉండగా, తాహిరు మూడు సెకన్లకు ఒక చెట్టు చొప్పున 1123 చెట్లను కౌగిలించుకున్నాడు.

అటవీ శాస్త్రంలో పట్టా పొందడానికి గత సంవత్సరం అలబామాకు తరలి వెళ్లలాడు తాహిరు.తన రికార్డు ప్రజలకు అడవులు, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందని ఆశిస్తున్నాడు.ఈ వ్యక్తి సృష్టించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి మరెన్నో మంచి రికార్డులను ప్రజలు క్రియేట్ చేసి పర్యావరణం పట్ల అవగాహన పెంచాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube