కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham )వైసీపీలో చేరారు.తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ( CM Jagan )సమక్షంలో ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా పార్టీలో చేరారు.ఈ మేరకు కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా ముద్రగడ పోటీపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ( YCP )విజయం కోసం తనవంతు కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు.







