పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం .. వైరల్ అవుతున్న పంజా డైరెక్టర్ రియాక్షన్!

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటించిన సినిమాలలో పంజా( Panjaa ) ఒకటి.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన మేకింగ్ విషయంలో ఈ సినిమా అభిమానులకు ఇప్పటికీ ఒక కల్ట్ మూవీ అని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ విష్ణువర్ధన్ ( Vishnu Vardhan )ఈ సినిమా తర్వాత తెలుగులో ఎలాంటి సినిమాలను చేయలేదు.అయితే ఈయన మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ప్రేమిస్తావా అనే యాక్షన్ త్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆకాశ్  డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో జనవరి 30 తేదీ విడుదల కాబోతోంది.

Panjaa Movie Director Vishnu Vardhan Interesting Comments On Ap Deputy Cm Pawan

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ విష్ణువర్ధన్ హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తెలుగు సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP Deputy CM Pawan Kalyan ) గురించి కూడా మాట్లాడారు.

Advertisement
Panjaa Movie Director Vishnu Vardhan Interesting Comments On Ap Deputy Cm Pawan

పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన పంజా సినిమా తర్వాత తాను ప్రేమిస్తావా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు.

Panjaa Movie Director Vishnu Vardhan Interesting Comments On Ap Deputy Cm Pawan

ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.ఆయనొక పవర్.అతనితో సినిమా చేస్తున్నప్పుడు తాను ఒక విషయం గమనించాను.

స్ట్రయిట్, టాలెంటెడ్ అయితే.అలాంటి వారిని ఆయన చాలా ఇష్టపడతారు.

ఎందుకంటే ఆయన కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అని విష్ణువర్ధన్ తెలిపారు.ఆయనలో ఒక పవర్ ఉందని.

ధనుష్ తెలుగు హీరోగా మారిపోతున్నాడా..?
వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...

అలాగే ఆయనలో చిన్నపిల్లాడి మనస్థత్వం కూడా గమనించాను.ప్రతి విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటారు.

Advertisement

ఇప్పుడాయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయనలో అంతే పవర్ ఎనర్జీ ఉంది అంటూ డైరెక్టర్ విష్ణువర్ధన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు