మామిడి కోతల అనంతరం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు..!

మామిడి సాగు( Mango Cultivation ) చేసి అధిక దిగుబడి సాధించాలంటే.తొలకరిలో యాజమాన్య పద్ధతులను పాటించాలి.

దాదాపుగా మామిడి తోటల్లో కోతలు పూర్తి అయినట్టే.వర్షాకాలం అంటే మామిడి చెట్లకు విశ్రాంతి దొరికే సమయం.

కాబట్టి కోతలు పూర్తయిన 15 రోజుల నుండి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగురులు వచ్చి చెట్లకు చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యకరంగా పెరిగే అవకాశం ఉంది.

Ownership Practices To Be Undertaken After Mango Harvesting.. , Mango Harvesti

తొలకరి వర్షాలకు మామిడి చెట్లపై కొత్త చిగుర్లు వచ్చే దానిపైనే మరుసటి సంవత్సరం వచ్చే దిగుబడి ఆధారపడి ఉంటుంది.కాబట్టి కోతల అనంతరం చెట్లకు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్( Pruning ) వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి.అనంతరం వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతి ఇవ్వాలి.

Advertisement
Ownership Practices To Be Undertaken After Mango Harvesting..! , Mango Harvesti

మామిడి చెట్లకు పూత మంచిగా రావాలంటే జూన్, జూలై, ఆగస్టు నెలలో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలి.చెట్లకు కోతలు జరిపిన అనంతరం వెంటనే నీటి తడి అందించాలి.

వర్షాకాలంలో మామిడి తోటల్లో రెండుసార్లు దున్నుకోవడం వల్ల కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాన నీరు ఇంకుతుంది.

Ownership Practices To Be Undertaken After Mango Harvesting.. , Mango Harvesti

వర్షాకాలంలో తొలకరి చినుకుల తర్వాత అట్ర టాప్ ఎకరాకు 800 గ్రాములు 240 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి.ఆ తరువాత గై సెల్ లేదా రౌండప్ కలుపు మందు 8 మి.లీ ను ఒక లీటర్ నీటిలో కలిపి ఈ మిశ్రమంలో 20 గ్రాముల అమోనియం సల్ఫేట్( Ammonium sulfate ) 10 గ్రాముల యూరియా కలిపి 20- 25 రోజుల కలుపుపై పిచికారి చేయాలి.ఈ పిచికారీ మందులు చెట్లపై పడకుండా జాగ్రత్తలు వహించాలి.

మామ్మిడి తోటలో ఏవైనా అంతర పంటలు వేయాలనే ఆలోచన ఉంటే పొలాన్ని పరిశుభ్రం చేసుకుని, సేంద్రియ ఎరువులు వేసుకోవాలి.ముఖ్యంగా మామిడి చెట్లకు కత్తిరింపులు జరపాలి.అప్పుడే సూర్యరశ్మి బాగా తగిలి మంచి కాపునిస్తుంది.

తెలంగాణ రేషన్ లో ప్లాస్టిక్ బియ్యం.. నిజమెంత?
Advertisement

తాజా వార్తలు