తల్లి కాబోతున్న ఉపాసన.. మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవుగా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు 500 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నారు.

అయితే రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నా ఈ జోడీ శుభవార్త చెప్పకపోవడం గురించి ఫ్యాన్స్ ఫీలైన సంగతి తెలిసిందే.

పిల్లల గురించి ఉపాసన మాట్లాడుతూ పలు సందర్భాల్లో వెల్లడించిన విషయాలు వైరల్ అయ్యాయి.అయితే ఆ విమర్శలకు, నెగిటివ్ కామెంట్లకు చెక్ పెడుతూ ఉపాసన తల్లి కాబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే వార్త తెలిసి మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.గతంలో ఉపాసన గర్భవతి అంటూ వైరల్ అయిన ఫేక్ వార్తలు మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేశాయి.అయితే ఈసారి అధికారికంగా ప్రకటన రావడంతో ఈ వార్త నిజమేనని తేలిపోయింది.2023 సంవత్సరం రామ్ చరణ్ కు అటు కెరీర్ పరంగా ఇటు వ్యక్తిగతంగా కలిసొస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.పెళ్లైన పదేళ్ల తర్వాత రామ్ చరణ్ తండ్రి కాబోతుండటంతో ఉపాసన చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ శుభవార్తను తెలియజేశారు.చరణ్ ప్రస్తుతం శంకర్ మూవీ షూట్ పనులతో బిజీగా ఉన్నారు.

Advertisement

2023 సంవత్సరం జనవరిలో బుచ్చిబాబు సినిమాను కూడా చరణ్ మొదలుపెట్టనున్నారు.ఒకే సమయంలో రెండు ప్రాజెక్ట్ లలో నటించడం ద్వారా కెరీర్ పుంజుకుంటుందని ఈ స్టార్ హీరో భావిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ లతో చరణ్ కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ లను సొంతం చేసుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

చరణ్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు