Tirumala : తిరుమల నడకదారి సమీపంలో మరోసారి వన్యమృగాల సంచారం..!!

తిరుమల( Tirumala ) శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారి సమీపంలో మరోసారి వన్యమృగాల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

మెట్ల మార్గానికి సమీపంలో చిరుతతో( Leopard ) పాటు ఎలుగుబంటి( Bear ) సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నడకదారికి సుమారు 150 మీటర్ల దూరంలోనే చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.గత రెండు రోజులుగా రాత్రి సమయాల్లో ఇవి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు( Forest Officers ) రాత్రి సమయాల్లో భక్తులను గుంపులుగా వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.అయినప్పటికీ మరోసారి చిరుత, భల్లూకం సంచారం నేపథ్యంలో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు