ఉగాది పండుగ రోజు.. ఈ పనులను కచ్చితంగా చేయాలి..?

ముఖ్యంగా చెప్పాలంటే సనాతన ధర్మంలో ఉగాది( Ugadi )ని మొదటి పండుగగా భావిస్తారు.ఈ పండుగకు రెండు మూడు రోజుల ముందు నుంచే ఉగాది పనులను ప్రజలు మొదలుపెడతారు.

 On The Day Of Ugadi Festival.. These Things Should Be Done For Sure, Ugadi Panch-TeluguStop.com

ఉగాది రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి.అలాగే తైలా అభ్యంగన స్నానం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు, వేపాకు తోరణాలు కడతారు.

కొత్త దుస్తులు వేసుకొని కొత్త కుండ కొనడంతో ఈ పండుగ సందడి మొదలవుతుంది.ఒక వైపు పచ్చడి తయారు చేసుకుంటే, ఒక వైపు వేడి వేడిగా బక్ష్యాలు తయారవుతుంటాయి.

ఇంకా చెప్పాలంటే పచ్చడి వంటలు ఇష్టమైన దేవుడికి నైవేద్యంగా పెట్టి కొత్త ఏడాది అంతా శుభం కలగాలని కోరుకుంటారు.తర్వాత కుటుంబ సభ్యులందరూ పరిగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత బక్ష్యాలు తింటారు.మన తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో కొన్ని ప్రాంతాలలో మాంసం కూడా తింటారు.కోడిపుంజులను కోసి గ్రామ దేవతల మొక్కులు తీర్చుకుంటారు.అలాగే కొత్త పనులు, కొత్త వ్యాపారులు కూడా ఉగాది రోజు మొదలుపెడతారు.ఈ రోజు చేసే తైల అభ్యంగన స్నానం శరీరానికి నువ్వుల నూనె( Sesame oil ) పట్టించి నలుగు పిండితో చేసే స్నానం.

ఇది శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను తొలగిస్తుంది.కవి సమ్మేళనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు.

పంచాంగ శ్రవణం వినడం వల్ల ఈ సంవత్సరంలో జరగబోయే మంచి చెడులతో పాటు పరిణామాలు తెలుసుకుంటారు.కలియుగంలో తిధి నక్షత్ర ఫలితాలతో పాటు రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకుంటారు.ఇది జాగ్రత్తగా నడుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే ఉగాది రోజు కవులు ప్రత్యక్షంగా కవి సమ్మేళనం నిర్వహిస్తారు.కొత్త కవులు కొత్త ఆలోచనలు పాత ఉరవళ్ళు కలిపి కొత్త పద్యాలు కవితలు రచించి చదువుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube