హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్‌కు చిక్కులు తెస్తున్న ఆ ఇద్ద‌రు.. హ‌రీశ్ వార్నింగ్..?

రాష్టంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుపై నజర్ పెట్టింది.అక్కడ టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తారని వేరే పార్టీల నుంచి ఇద్దరు నేతలకు గులాబీ గూటికి తీసుకొచ్చారు.

 Those Two Who Are Bringing Implications To Trs In Huzurabad .. Harish Warning, T-TeluguStop.com

కానీ, వారు అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నారు.ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను ఓడించాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్ వ్యూహాలు పన్నుతోంది.దీని కోసం మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగారు.

ఎలాగైనా టీఆర్ఎస్‌‌ను గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు.ఇతర పార్టీల నాయకులను ఆకట్టుకుంటూ గెలుపుకోసం పరితపిస్తున్న టీఆర్ఎస్‌కు ఇద్దరు నేతలు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నారని టాక్.

కాంగ్రెస్ నుంచి అధికార పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి కమలం పార్టీ నుంచి అధికార పార్టీలో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డివ్యవహారశైలితో టీఆర్‌ఎస్ ఇబ్బందిపెడుతున్నారట.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరు తమ బలాలను నిరూపించుకునేలా వ్యవహరించాలని తెలుస్తున్నది.

వీరి తీరుతో ఆ కార్యక్రమంలో ఉన్న మంత్రి హరీశ్‌రావు షాక్ కు గురయ్యారని తెలుస్తోంది.వీరిద్దరినీ ఇలాగే వదిలేస్తే ఉప ఎన్నికలో పార్టీకి నష్టం కలుగుతుందనే భావనకు వచ్చారట.

వీరిని నియంత్రించేందుకు వేరు వేరుగా ఎన్నికల ప్రచారం చేయాలని వారికి సూచించినట్టు పార్టీ వర్గాల్లో చర్చమొదలైంది.వీరిద్దరూ ఒకే చోట ప్రచారం నిర్వహిస్తే బలప్రదర్శనకు చేస్తున్నారని టీఆర్ఎస్ భావిస్తున్నది.

అందువల్లే వారిద్దరికి మంత్రి హరీశ్ రావు వేరువేరు టార్గెట్స్ ఇచ్చినట్టు టాక్.ప్రస్తుతం హుజూరాబాద్ టికెట్ గెల్లు శ్రీనివాస్‌కు టీఆర్ఎస్ కేటాయించినా.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటును తామే దక్కించుకోవాలని ఓ వైపు కౌశిక్ రెడ్డి, మరో వైపు పెద్దిరెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నది.అందుకే వీరిపై మంత్రి హ‌రీశ్‌రావు ఫోక‌స్ పెట్టి పార్టీకి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూస్తున్నారంట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube