సమాజంపై బాధ్యతగా ఉన్న సన్నిలియోన్

మాటకి ముందు , మాట తరువాత పోర్న్ స్టార్ అని సన్నీ లియోన్ ని గేలి చేస్తారు కాని సన్నిది చాలా పెద్ద మనసు.

ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకుంది సన్నీ.మన చేతిలో ఒక పని ఉండి, దానితో వేలు సంపాదించినా వదులుకోవడానికి ఇష్టపడం మనం.అలాంటిది లక్షలు వదిలేసుకుంది సన్నీ.విషయం ఏమిటంటే, ఒక పాన్ మసాల కంపెనీకి సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

అలాంటి పాన్ మసాల కంపెనీకే షారుఖ్ ఖాన్ కుడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.ఇలా సినిమాతారలు పాన్ మసాల ను ప్రమోట్ చేస్తే అది యువతపై చెడు ప్రభావం చూపుతుందని డిల్లి గవర్నమెంటు సన్నితోపాటు షారుఖ్ కి లేఖ పంపింది.

షారుఖ్ సంగతేమో కాని సన్నీ ఈ లెటర్ మీద స్పందించింది.ఇకపై పాన్ మసాలతో పాటు సమాజంపై చెడు ప్రభావం చూపే ఎలాంటి ప్రాడక్ట్స్ ని తానూ ప్రమోట్ చేయనని మాటిచ్చింది సన్నీ లియోన్.

ఆ రకంగా లక్షలు విలువ చేసే యాడ్ ని వదిలేసుకుంది సన్నీ.సన్నీని చూసి షారుఖ్ ఖాన్ కుడా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే12, ఆదివారం 2024

తాజా వార్తలు