మొటిమలు తరచూ వేధిస్తున్నాయా.. అయితే ఓట్స్ తో వాటికి ఇలా చెక్ పెట్టండి!

సాధారణంగా కొందరిని మొటిమలు( Acne ) చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.నాన్ స్టాప్ గా ముఖం పై మొటిమలు వస్తూనే ఉంటాయి.

ముఖ సౌందర్యాన్ని దారుణంగా పాడు చేస్తాయి.ఎల్లప్పుడూ ముఖంపై మొటిమలు ఉండటం వల్ల అసౌకర్యానికి మరియు మానసిక వేదనకు గురవుతుంటారు.

మిమ్మల్ని కూడా మొటిమలు తరచూ వేధిస్తున్నాయా.? డోంట్ వర్రీ.చర్మంపై మృత కణాలు పేరుకుపోవడం, ఆయిలీ స్కిన్, ఆహారపు అలవాట్లు మొటిమలకు ప్రధాన కారణాలు.

కాబట్టి మొదట హెల్తీ ఫుడ్ ను డైట్ లో చేర్చుకోండి.ఫ్యాటీ ఫుడ్, షుగర్, స్వీట్స్, నాన్ వెజ్ ని అవాయిడ్ చేయండి.

Advertisement
Oats Help To Get Rid Of Acne Naturally Details! Oats, Oats Benefits, Acne, Pimpl

తాజా కూరగాయలు, ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, గింజలు, మొలకెత్తిన విత్తనాలు, నట్స్ వంటివి డైట్ లో చేర్చుకోండి.ఇవి మీ ఆరోగ్యాన్నే కాదు మీ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.

అనేక చర్మ సమస్యలను అడ్డుకుంటాయి.అలాగే ఓట్స్ తో( Oats ) మొటిమలకి చెక్ పెట్టవచ్చు.

Oats Help To Get Rid Of Acne Naturally Details Oats, Oats Benefits, Acne, Pimpl

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్,( Sugar ) వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్, నాలుగు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని టమాటో ముక్క తో ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం ఐదు నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.

Oats Help To Get Rid Of Acne Naturally Details Oats, Oats Benefits, Acne, Pimpl
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.డెడ్ స్కిన్ సెల్స్ పూర్తిగా తొలగిపోతాయి.

Advertisement

చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి త‌గ్గు ముఖం పడుతుంది.దీంతో మొటిమలు రావడం ఆగుతాయి.

ఉన్న మొటిమలు త్వరగా తగ్గుముఖం పడతాయి.మొటిమల తాలూకు మచ్చలు సైతం మాయమవుతాయి.

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు