పొలిటికల్ ఎంట్రీపై నోరు విప్పిన తారక్.. అప్పుడే వస్తాడట!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఈ సినిమా లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు.

వీరిద్దరూ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.అత్యంత భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో బ్లాక్ బస్టర్ హిట్ చేసేసారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.నాలుగేళ్ళ నిరీక్షణకు మొన్నటి తో ఫుల్ స్టాప్ పడింది.

ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో టీమ్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమా హిట్ పై ఆనందంగా ఉన్నారు.

Advertisement
Ntr Comments On Politics Entry Details, NTR, RRR, Political Entry, Ntr Political

ఎన్టీఆర్, చరణ్ నటించిన ఈ సినిమా అంతటా రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టిస్తూ సరికొత్త చరిత్రను లిఖిస్తుంది.ఇక ఇది ఇలా ఉండగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తారక్ పొలిటికల్ ఎంట్రీ పై మాట్లాడారు.

Ntr Comments On Politics Entry Details, Ntr, Rrr, Political Entry, Ntr Political

తారక్ ఎప్పుడు కనిపించినా అభిమానులు ఆయనను పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు.అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తారక్ ఈ విషయం తెలిపాడు.నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను.

ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం స్టార్ట్ చేశాను.నేను మొదట దానికే కట్టుబడి ఉండాలి అనుకుంటున్నాను అని అన్నారు.

Ntr Comments On Politics Entry Details, Ntr, Rrr, Political Entry, Ntr Political

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ టిడిపి లోకి వస్తే టిడిపి భవిష్యత్తు బాగుంటుంది.అని ఎన్టీఆర్ అభిమానులు ఆశ పడుతున్నారు.టిడిపి స్థాపించి ఇప్పటికే 40 ఏళ్ళు అవుతున్న క్రమంలో ఎన్టీఆర్ రాక కోసం ఆయన అభిమానులు ఎదురు చుస్తున్నారు .అయితే ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తే ఆయన ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు