ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి

సూర్యాపేట జిల్లా: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, ఎన్టీఆర్ అభిమాని పెద్దిరెడ్డి రాజా అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు.

జిల్లా కేంద్రం పబ్లిక్ క్లబ్ లో ఆదివారం ఉదయం 10.30ని ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు.ప్రతి తెలుగువాడి గుండెలో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని,తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

ఎన్టీఆర్ సినీ పరిశ్రమకే కాకుండా రాజకీయ రంగం లోనూ తనదైన ముద్ర వేశారన్నారు.సుధా బ్యాంక్ ఎండి పబ్లిక్ క్లబ్ కార్యదర్శి పెద్దిరెడ్డి గణేష్ కు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సన్మాన కార్యక్రమం ఉంటుందని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.

NTR Centenary Celebrations Should Be Made Successful Peddireddy Raja,NTR Centena

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు భువనగిరి భాస్కర్,శంకర్ చౌదరి,సకినాల కృష్ణ, అంజన్ ప్రసాద్, సూరయ్య,గుండా రమేష్, జితేందర్ పాల్గొన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Latest Suryapet News