భారీ వసూళ్లతో దూసుకుపోతున్న భీష్మ...

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా నటించినటువంటి చిత్రం భీష్మ.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.

అయితే ఈ చిత్రంలో  హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా అనంతనాగ్, వెన్నెల కిషోర్, రఘుబాబు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.

భారీ అంచనాల నడుమ ఈ నెల 21వ తారీకున విడుదలైనటువంటి చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.అంతేగాక దర్శకనిర్మాతలు కూడా కాసుల పంట పండిస్తోంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి నాలుగు రోజుల కలెక్షన్లు కనుక ఒకసారి పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 16.71 కోట్లు కొల్లగొట్టింది.ఇందులో నైజాంలో దాదాపుగా 6.6 4 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో 2.55 కోట్లు, ఉత్తరాంధ్ర 2.13 కోట్లు, కృష్ణ 1.05 కోట్లు, గుంటూరు 1.51 కోట్లు, నెల్లూరు 0.54 కోట్లు, తూర్పుగోదావరి 1.32 కోట్లు, పశ్చిమ గోదావరి 0.97 కోట్లు వసూళ్లు రాబట్టింది.అయితే ఈసారి ఎప్పటిలాగే నితిన్ నైజాం ఏరియాలో తన హవాని కొనసాగించాడు.ఏకంగా 6.64 కోట్ల రూపాయలు వసూలు చేసి నైజాంలో నితిన్ కి తిరుగులేదని అనిపించుకున్నాడు. చిత్రం మంచి పాజిటివ్ హిట్ టాక్ ఉండటంతో ఈ వసూళ్లు మరింత పెరిగే విధంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Nithin Bheeshma Movie Fourth Day Collection Update

అయితే ప్రస్తుతం మెషిన్ "రంగ్ దే" అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

Advertisement
Nithin Bheeshma Movie Fourth Day Collection Update-భారీ వసూళ్

అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు